Nikhil EPC exclusive Ramcharan Dhruva exclusive

Monday, 12 January 2015

          పవన్ ‘గోపాల గోపాల’ విడుదల అయిపోవడంతో ఇప్పుడు ఇక అందరి దృష్టి ఎల్లుండి విడుదల కాబోతున్న శంకర్ ‘ఐ’ పై ఉంది. తెలుగుతోపాటు తమిళం, హిందీ భాషల్లో దాదాపు ౩౦౦౦ ధియేటర్లలో విడుదల కాబోతున్న ఈసినిమా స్టిల్స్ మరి కొన్నింటిని లేటెస్ట్ గా శంకర్ విడుదల చేసాడు. ఆ స్టిల్స్ లో మానవ మృగ ఆకారంలో ఉన్న విక్రమ్ రిక్షా తొక్కుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. ఇప్పుడు ఈ స్టిల్ వెబ్ మీడియాకు హాట్ టాపిక్ గా మారింది.   రకరకాల గెటప్ లతో విక్రమ్ ఈసినిమాలో కనిపిస్తూ ఉండటంతో ఈ సినిమా మన తెలుగులో కూడా రికార్డులను క్రియేట్ చేస్తుందా అనే అనుమానం చాలామందికి కలుగుతోంది. ఒకవైపు ‘గోపాల గోపాల’ పాజిటివ్ టాక్ తెచ్చుకుని కలెక్షన్స్ విషయంలో ముందడుగులో ఉన్నా ఇరు రాష్ట్రాలలోని బిసి సెంటర్లలో ఈరోజు ఉదయం ‘గోపాల గోపాల’ కలెక్షన్స్ కొద్దిగా డ్రాప్ అయినట్లుగా వార్తలు వస్తున్నాయి.   బి,సి సెంటర్లలోని మాస్ ప్రేక్షకులకు పవన్ గోపాలుడు ఊహించినంత కిక్ ఇవ్వలేదనే టాక్ వినిపిస్తోంది. ఈ నేపధ్యంలో గ్రాఫిక్స్ భారీ స్థాయిలో ఉండే శంకర్ ‘ఐ’ అటు పట్టణ ప్రేక్షకులనే కాకుండా బి,సి సెంటర్లలో బాగా ఆకర్షించే ఆస్కారం కనిపిస్తోంది అని విశ్లేషకులు అంటున్నారు.   దీనిని బట్టి చూస్తూ ఉంటే శంకర్ ‘ఐ’ ప్రభావం ఎంతో కొంత స్థాయిలో పవన్ గొపాలుడి పై ఉంటుంది అని అంటున్నారు విశ్లేషకులు. ఏమైనా రెండు విలక్షణ సినిమాలు సంక్రాంతి పోటీలో ఎదురెదురుగా నిలవడం ఈ రెండు సినిమాలను కొనుక్కున్న బయ్యర్లను తికమక పెడుతోంది అని టాక్..


Naga Chaithanya SSS Banner
Suamanth Naruda Donaruda Banner