Nagarjuna Om Namo Venkateshaya exclusive Nani NenuLocal exclusive

Tuesday, 10 February 2015

వివాదాలకు కాస్తంత దూరంగా ఉండే మెగా ఫ్యామిలీలో రాంచరణ్‌ రచ్చ ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. వాస్తవానికి రాంచరణ్‌కు వివాదాలు కొత్తకాదు. ఒకసారి ఆయనగారి ఆగ్రహాన్ని రోడ్డు మీద ప్రదర్శించటాన్ని మర్చిపోలేరు. ఇద్దరు టెకీల మీద ఆయనగారి ప్రతాపం అప్పట్లో వైరల్‌ అయ్యింది. మేలిపండు చూడ‌, మేలిమై ఉండ‌గా – అన్న‌ట్టు పైకి అంద‌రూ హీరోల్లానే క‌నిపిస్తారు. కానీ లోతు చూస్తే తెలుస్తుంది అస‌లు సంగ‌తి. హీరోల్లోనూ ఆక‌తాయిలు, మందుబాబులు ఉంటార‌ని చాలాసార్లు రుజువైంది. ఇదిగో… ఇది మ‌రో ఉదంతం. రామ్‌చ‌ర‌ణ్ తాగి గోల చేసి ఇప్పుడు మీడియాలో హాట్ టాపిక్ అయ్యాడు. శ‌నివారం రాత్రి జూబ్లీహిల్స్‌ రోడ్ నం.25లో త‌న నివాసంలో స్నేహితుల‌కు పార్టీ ఇచ్చాడు చ‌ర‌ణ్. ఈ పార్టీలో రాజ‌కీయ నాయ‌కుల త‌న‌యులూ ఉన్నార‌ట‌. శనివారం రాత్రి నుంచి ఆదివారం తెల్ల‌వారుఝాము వ‌ర‌కూ పార్టీ కొన‌సాగింద‌ని తెలుస్తోంది. ఎవ‌రి ఇంట్లో వాళ్లు పార్టీ చేసుకొంటే త‌ప్పేంటి?? కాక‌పోతే తాగి అల్ల‌రి అల్ల‌రి చేశార‌ట‌. ఈ అరుపులు, కేకలతో స్థానికులకు నిద్రాభంగ‌మైంది. దాంతో ఆ వీధిలోనే ఉంటున్న‌ ఐపీఎస్ అధికారి గౌతం సవాంగ్ 100కు ఫోన్‌చేసి పోలీసులకు సమాచారం అందించారు. జూబ్లీహిల్స్ పోలీసులు రంగ ప్ర‌వేశం చేయాల్సివ‌చ్చింది. చ‌ర‌ణ్‌నీ, అత‌ని స్నేహితుల్ని న‌చ్చ‌జెప్పే ప్ర‌య‌త్నం చేసినా మాట విన‌లేద‌ని స‌మాచార‌మం. దాంతో ఆదివారం సాయింత్రం చ‌ర‌ణ్ పై న్యూసెన్స్ కేసు న‌మోదు చేసిన‌ట్టు తెలుస్తోంది. ఈ వ్య‌వ‌హారం ఎంత వ‌ర‌కూ వెళ్తుంద‌నేది ఆస‌క్తిగా మారింది.
Update: రామ్ చరణ్ ఇంటి వద్ద శనివారం రాత్రి జరిగిన పార్టీ విషయంలో పెద్ద గొడవ జరిగిన సంగతి తెలిసిందే. అర్దరాత్రి తమకు నిద్రబంగం చేస్తున్నారని, డిస్ట్రబెన్స్ చేస్తున్నారంటూ చుట్టుపక్కల వారకు ఫిర్యాదు చేయడంతో విషయం పోలీసుల వరకు వెళ్లింది. ఈ ఘటనపై రామ్ చరణ్ తన సోషల్ నెట్వర్కింగ్ ద్వారా స్పందించారు. ‘మా ఇంట్లో జరిగిన సింపుల్ ఫ్యామిలీ డిన్నర్ లౌడ్ బాష్‌గా చిత్రీకరించడం ఆశ్చర్యకరంగా ఉంది. మా ఇరుగుపొరుగు వాళ్లను నేను గౌరవిస్తాను. వారి ప్రైవసీకి భంగం కలిగించాలనే ఉద్దేశ్యం మాకు ఏ మాత్రం ఉండదు. మాపై వచ్చిన ఆరోపణలన్నీ తొలగిపోతాయని భావిస్తున్నాను’ అంటూ రామ్ చరణ్ వివరణ ఇచ్చారు.

Venky GURU Banner
Chiri Khaidi No:150 Banner