Nikhil EPC exclusive Ramcharan Dhruva exclusive

Friday, 31 July 2015

బాలయ్య 100వ సినిమాగా ఆదిత్య 999..?

బాలకృష్ణ 99వ సినిమా డిక్టేటర్ షూటింగ్ మొదలైన అందరి దృష్టీ ఇప్పుడు వందో సినిమా మీదే వుంది. ఈ సినిమాని బాలకృష్ణని సింహ, లెజెండ్ గా చూపించిన బోయపాటి శ్రీను తెరకెక్కిస్తారని అనుకుంటున్నా దానికి ధీటుగా మరో పేరూ వినపడుతోంది.
అయన వేరెవరో కాదు బాలకృష్ణతో ఆదిత్య 369, బైరవద్వీపం లాంటి సినిమాలను తీసిన సింగీతం శ్రీనివాసరావు. ఈ రెండు సినిమాలు అప్పట్లో సూపర్ హిట్. ఆదిత్య 369 సినిమా అప్పట్లో ఓ ప్రయోగమే. ఆ ప్రయోగం విజయవంతం అయింది. ఈ సినిమాకి సీక్వెల్ చేయాలన్నది దర్శకుడి సింగీతం చిరకాల కోరిక. ఆ మేరకు స్క్రిప్ట్ పనులు జరుగుతున్నట్టు కొంతకాలం క్రితం ఆయన తెలిపారు. ఆ మధ్య జరిగిన ఓ అవార్డుల కార్యక్రమంలో బాహుబలి సినిమా గురించి అందరూ చెబుతూంటే బాలయ్య స్పందిస్తూ ఆదిత్య 369, బైరవద్వీపం లాంటి సినిమాలను ఆ రోజుల్లోనే చేశామని గుర్తు చేశారు. చూస్తుంటే బాలయ్య 100వ సినిమా ఆదిత్య 369కి సీక్వెల్ గా చెప్పుకునే ఆదిత్య 999 అయ్యే అవకాశాలున్నాయి. అయితే సింగీతం వారు కమల్ తో ఓ సినిమా చేయనున్నట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ సినిమా మళ్ళీ అనుమానంగా కనపడుతోంది
Naga Chaithanya SSS Banner
Suamanth Naruda Donaruda Banner