Nikhil EPC exclusive Ramcharan Dhruva exclusive

Sunday, 12 July 2015

దర్శకుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ‘బాహుబలి’రిలీజ్ అయి నేటికి రెండు రోజులు ముగిసింది. దీంతో ఈ మూవీకి సంబంధించిన కలెక్షన్స్ వివరాలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ప్రపంచవ్యాప్తంగా నాలుగు ప్రధాన భాషల్లో భారీ ఎత్తున విడుదలైంది బాహుబలి మూవీ. ఈ మూవీకి సంబంధించిన మొదటి రోజు కలెక్షన్స్ ప్రపంచ వ్యాప్తంగా 60 కోట్ల రూపాయలను కొల్లగొట్టింది.

ఇక రెండు రోజు కలెక్షన్స్ వివరాల్లోకి వెళితే, దాదాపు 55 కోట్ల రూపాయలను కలెక్ట్ చేసినట్టుగా ఇండియన్ బాక్సాపీస్ లెక్కలు చెబుతున్నాయి. ఈ రెండు రోజుల కలెక్షన్స్ రిపోర్ట్స్ ని కలుపుకుంటే బాహుబలి రెండు రోజుల్లోనే వంద కోట్ల రూపాయలను కలెక్ట్ చేసిన ఇండియ సినీ చరిత్రలోనే ఓ అరుదైన రికార్డ్ ని క్రియేట్ చేసింది.
ఇప్పటి వరకూ ఈ మూవీ 115 కోట్ల రూపాయలను కలెక్ట్ చేసి అందరిని ఆశ్ఛర్యపరుస్తుంది. సౌత్ ఇండస్ట్రీ మూవీ, ముఖ్యంగా ఓ తెలుగు మూవీ ఈ రేంజ్ లో సక్సెస్ సాధించడం అనేది సర్వత్రా చర్ఛనీయాంశంగా మారింది. రెండు రోజుకి సంబంధించిన కలెక్షన్స్ వివరాలను త్వరలనే మీ ముందుకు తీసుకువస్తాం.
Naga Chaithanya SSS Banner
Suamanth Naruda Donaruda Banner