Nikhil EPC exclusive Ramcharan Dhruva exclusive

Thursday, 23 July 2015

మహేశ్ బాబు తాజా చిత్రం ‘శ్రీమంతుడు’ పాటలు ఇటీవలే విడుదలయ్యాయి… అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి… తొలిసారి మహేశ్ సరసన శ్రుతిహాసన్ నాయికగా నటించిన ఈ చిత్రానికి విడుదలకు ముందే ఓ స్పెషల్ క్రేజ్ నెలకొంది… ప్రాంతాలవారిగా అమ్మకాల్లో ‘శ్రీమంతుడు’ మహేశ్ బాబు చిత్రాల్లోకి నంబర్ వన్ గా నిలచింది… ఆంధ్ర ప్రాంతంలో ఈ చిత్రం హక్కులు 21 కోట్లు పలుకగా, తెలంగాణలో 14 కోట్ల నలభై లక్షలు పలికాయి… ఇక రాయలసీమలో ‘శ్రీమంతుడు’ 7 కోట్ల ఇరవై లక్షలకు అమ్ముడు పోగా, కర్ణాటక నుండి మరో ఆరు కోట్లు సంపాదించాడు… మన దేశంలోని ఇతర ప్రాంతాల నుండి మరో రెండు కోట్లు రానుంది… ఇక ‘శ్రీమంతుడు’ ఓవర్సీస్ రైట్స్ 9 కోట్లు పలికాయి… వెరసి ప్రాంతాలవారిగా ‘శ్రీమంతుడు’ మొత్తం 59 కోట్ల అరవై లక్షలు పలికింది… కాగా, ఈ సినిమా శాటిలైట్ రైట్స్, ఆడియో రైట్స్, హిందీ డబ్బింగ్ అన్నీ కలిపి మరో 15 కోట్లు పలికినట్టు భోగట్టా… ఈ రీతిన విడుదలకు ముందే ‘శ్రీమంతుడు’ టైటిల్ కు తగ్గట్టుగానే 75 కోట్ల బిజినెస్ చేయడం విశేషం!
 శ్రీమంతుడు’ చిత్రం దర్శకుడు కొరటాల శివకు ఓ పరీక్ష… ఎందుకంటే తొలి సినిమాతో బంపర్ హిట్ కొట్టిన డైరెక్టర్ కు రెండో చిత్రం తప్పకుండా తెలుగునాట ఓ పరీక్ష అనే చెప్పాలి… ఈ పరీక్షలో శివ సునాయాసంగా విజయం సాధిస్తాడని మహేశ్ ఫ్యాన్స్ బల్లగుద్ది చెబుతున్నారు… ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సమకూర్చిన సంగీతమే వారికి అంతటి భరోసాను అందిస్తోంది… ఈ సినిమాలోని ఆరు పాటలు అభిమానులతో పాటు మాస్ ను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి… పైగా ఒకప్పుడు మ్యూజికల్ హిట్ గా నిలచిన ఏయన్నార్ సినిమా ‘శ్రీమంతుడు’ టైటిల్ కూడా ఈ చిత్రానికి ఓ సెంటిమెంట్ గా భావిస్తున్నారు ఫ్యాన్స్… గతంలో ఏయన్నార్ ‘యువరాజు’ టైటిల్ తో రూపొందిన మహేశ్ ‘యువరాజు’ మంచి విజయాన్ని మూటకట్టుకుంది… ఈ తీరున ‘శ్రీమంతుడు’ కూడా విజయం సాదిస్తుందని అభిమానుల ఆశ… మహేశ్ పుట్టినరోజుకు రెండురోజులు ముందే – అంటే ఆగస్టు 7న విడుదలవుతున్న ‘శ్రీమంతుడు’ జనాన్ని ఏ మేరకు అలరిస్తాడో, ఏ తీరున వసూళ్ళు రాబడతాడో చూడాలి…
Naga Chaithanya SSS Banner
Suamanth Naruda Donaruda Banner