Baahubali exclusive GURU exclusive

Monday, 17 August 2015

'Mahesh Babu' To Adopt 'Burripalem' Village
మహేష్ తన తాజా సినిమా శ్రీమంతుడు సినిమాలో చూపించిన గ్రామ దత్తత రియల్ లైఫ్ లో చూపించాలని అనుకుంటున్నాడు. తన తండ్రి పుట్టి పెరిగిన బుర్రిపాలెంని దత్తత తీసుకుంటున్నట్లు శ్రీమంతుడు సక్సెస్ మీట్ లో ప్రకటించాడు మహేష్ బాబు.
మంచి సినిమా చేస్తున్నప్పుడు డబ్బుల గురించి ప్రస్తావించవద్దన్నా మహేష్ తన 16 ఏళ్ల కెరీర్లో మంచి సినిమా చేశానన్న తృప్తి ఉందన్నారు. ఈ సినిమా చూసి ప్రతి ఒక్కరు స్ఫూర్తి పొందడం సంతోషంగా ఉందని అన్నారు మహేష్. కథ నచ్చడంతోనే సింగిల్ సిట్టింగ్ లోనే ఓకే చేశామని ముందుగా అనుకున్నట్లుగానే సినిమాలో మైనస్ పాయింట్స్ నే ప్రమోషన్ లోను హైలెట్ చేయడంతో సినిమా మంచి సక్సెస్ ని అందుకుందని ఆనందం వ్యక్తం చేశాడు మహేష్. శ్రీమంతుడు సక్సెస్ మీట్ లో మహేష్ తో పాటు కొరటాల శివ, రాజేంద్ర ప్రసాద్, జగపతి బాబు తదితరులు పాల్గొన్నారు.
Venky GURU Banner
Sampoo KobbariMatta Banner