Nagarjuna Om Namo Venkateshaya exclusive Nani NenuLocal exclusive

Thursday, 20 August 2015

శ్రీమంతుడు మనసున్న మారాజు..!!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఎన్నో కమర్షియల్ చిత్రాలు చూశాం..మెస్సేజ్ ఓరియెంటెడ్ సినిమాలకు కూడా చూశాం.. ఈ మద్య కొరటాల శివ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహష్ బాబు,శృతి హాసన జంటగా నటించిన శ్రీమంతుడు చిత్రం విడుదలైంది. ఇందులో ‘ఊరి నుంచి చాలా తీసుకున్నాం..ఊరికి ఎంతో కొంత ఇవ్వాలి కదా’ అనే కాన్సెప్ట్ చాల కొత్తరకంగా ఉంది.. అంతే కాదు అందరినీ ఆలోచింప జేసేలా ఉంది.ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు రెండుగా విడిపోయాయి.
అభివృద్ది కోసం తాపత్రయపడుతున్న రాష్ట్రాల్లో ఎన్నో గ్రామాలు ఉన్నాయి.. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ‘గ్రామజ్యోతి’ అనే పథకం ద్వారా ఊరిని బాగు చేద్దాం అన్న సంకల్పంతో ముందుకు సాగుతుంది. ఇక శ్రీమంతుడు సినిమా కాన్సెప్ట్ ఫాలో అవుతున్నవారు కూడా బాగానే పెరుగుతున్నారు. ఒక వ్యక్తిని కాదు ఒక ఊరినే దత్తత తీసుకుంటే చిరకాలం వారి గుండెల్లో పేరు నిలిచిపోతుంది అని వారు భావిస్తున్నారు. ఇక తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన ‘గ్రామజ్యోతి’ పథకానికి దన్నుగా నిలిచేందుకు ప్రిన్స్ మహేశ్ సంసిద్ధత వ్యక్తం చేశారు.
తెలంగాణలోని ఏదేనీ గ్రామాన్ని దత్తత తీసుకోవాలని కోరిన తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రతిపాదనకు మహేశ్ బాబు సానుకూలంగా స్పందించారు. మహబూబ్‌నగర్ జిల్లాలోని ఒక పల్లెను గ్రామజ్యోతి కార్యక్రమం కింద దత్తత తీసుకునేందుకు సినీ నటుడు మహేశ్‌బాబు సంసిద్ధత వ్యక్తం చేశారు. విచిత్రమేమిటంటే తెలంగాణ ‘గ్రామ జ్యోతి’ కార్యక్రమం చేపట్టినప్పుడు ఇలాంటి సినిమా రావడం చాలా సినిమాలోనూ గ్రామాభివృద్ధి, సామాజిక బాధ్యత వంటి అంశాలను సృజించడం ఎంతో బావుందని ట్వీట్ చేశారు. దీనికి వెంటనే స్పందించిన మహేశ్ థ్యాంక్యూ కేటీఆర్ సర్ అంటూ తిరిగి ట్వీట్ చేశారు.
Venky GURU Banner
Chiri Khaidi No:150 Banner