Vunnadhi Okate Jindhagi Raja The Great

Wednesday, 5 August 2015

Jr.NTR for Kathi Remake
Jr NTR remake Vijay's Kathi movie in Telugu


యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ ఓ సూప‌ర్ హిట్ రీమేక్ సినిమాలో న‌టించేందుకు రంగం సిద్ధ‌మైంది. విలక్షణ దర్శకుడు మురుగదాస్-ఇళ‌య ద‌ళ‌ప‌తి విజ‌య్ కాంబినేష‌న్‌లో గ‌త సంవ‌త్స‌రం దీపావళికి కోలీవుడ్‌లో రిలీజ్ అయ్యి హిట్ అయిన క‌త్తి సినిమా అక్క‌డ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అయ్యింది.
ఓవ‌రాల్‌గా క‌త్తి రూ.100 కోట్ల‌కు పైగా వ‌సూళ్లు సాధించింది. రైతుల కోసం పోరాడే పవర్‍ఫుల్ పాత్రలో విజయ్ న‌టించారు. కోలీవుడ్‌లో బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ అయిన ఈ సినిమాను అప్పుడే తెలుగులో డ‌బ్ చేయాల‌నుకున్నారు. అగ్ర‌నిర్మాత ఠాగూర్ మ‌ధు ఈ సినిమా రీమేక్ రైట్స్‌ను కూడా పొందారు. ముందుగా ఈ రీమేక్ సినిమాలో ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ న‌టిస్తార‌ని వార్త‌లు వ‌చ్చాయి. అయితే ప‌వ‌న్ వేరే ప్రాజెక్టుల్లో బిజీ కావ‌డంతో ఇప్పుడు త‌ర్వాత ప‌లువురు పెద్ద హీరోలు ఈ ప్రాజెక్టులో చేసేందుకు ఆస‌క్తి చూపినా అవి ప‌ట్టాలెక్క‌లేదు.
తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ సినిమా చేసేందుకు సిద్ధమైపోయారని సమాచారం. బలుపు, పండగ చేస్కో లాంటి సినిమాలతో హిట్ ట్రాక్‌లో ఉన్న యంగ్ డైరెక్ట‌ర్ మ‌లినేని గోపీచంద్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారట‌. గోపీచంద్ గ‌తంలో మురుగదాస్ వద్ద అసిస్టెంట్‌గా చేశారు. ఇక శిష్యుడు డైరెక్ట్ చేసే తెలుగు వెర్ష‌న్ కోసం గురువు మురుగ‌దాస్ స్క్రీన్‌ప్లేలో మార్పులు చేయనున్నారట. ప్రస్తుతం ఎన్టీఆర్ సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.
Tarun Upcoming Movie
Sampoo KobbariMatta Banner