Nikhil EPC exclusive Ramcharan Dhruva exclusive

Tuesday, 4 August 2015

Srimantudu Movie Highlights

ఇండస్ట్రీ లో ఏ పెద్ద స్టార్ సినిమా వస్తుందన్న ఆ చిత్రం ఫై అంచనాలు భారీ స్థాయిలో ఉంటాయి..టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్ , మహేష్ బాబు వంటి పెద్ద స్టార్స్ సినిమా రిలీజ్ అవుతుందంటే చాలు సాదారణ అబిమాని నుండి సినిమా ప్రేమించే ప్రతి ఒక్కరు ఆసక్తిగా ఎదురుచుస్తారు..తాజాగా మహేష్ నటించిన ‘శ్రీమంతుడు’ చిత్రం ఫై ఇప్పుడు అందరి చూపు పడింది…ఓ పక్క ఇండస్ట్రీ అల్ టైం హిట్ గా బాహుబలి ఊపుతుండడంతో, మరి శ్రీమంతుడు ఎంత వరకు ఆ ఊపును ఆపోతుందని అందరు ఎదురుచూస్తున్నారు.
శ్రీమంతుడు రిలీజ్ దగ్గర పడుతున్న కొద్ది సినిమా కథ ఏంటో , అన్దోలో హైలైట్స్ ఏంటో తెలుసుకోవాలని అందరికి ఆసక్తి ఉండడం సాదారణం.. తాజాగా శ్రీమంతుడు చిత్రం లోని ప్రధాన హైలైట్స్ ఏంటో మిర్చి కోసం అందిస్తుంది.. మొట్ట మొదటిసారిగా మహేష్ ఫ్యామిలి, యాక్షన్ & రొమాంటిక్ వంటి ఫుల్ ప్యాక్ తో రాబోతున్నాడు.. శ్రీమంతుడు చిత్రలోని కథ అంతా ఓ ఎత్తు అయితే చివర్లో వచ్చే క్లైమాక్స్ మాత్రం ఓ ఎత్తని సమాచారం. క్లైమాక్స్ సన్నివేశాల్లో మహేష్ అందరిని కంట తడి పెట్టించడం ఖాయం అంటున్నారు. ఇప్పటివరకు చూడని మహేష్ ని ఈ చిత్రం లో చూడబోతున్నారని చిత్ర యూనిట్ చెపుతుంది.. కుటుంబ విలువలు, మానవతా విలువలని ప్రతి ఒక్కరి హృదయాల్ని టచ్ అయ్యేలా సినిమా తెరకెక్కిందని, ఇంటర్వల్ బ్లాక్ కూడా సినిమాకి మరో హై లైట్ గా నిలుస్తుందట.. అంతే కాకుండా కొరటాల శివ రాసిన డైలాగ్స్ కు ప్రేక్షకులనుండి విశేష స్పందన వస్తుందని చెపుతున్నారు..
“ఏ ఎదవ పనిచేసినా వాడిని కాపాడటానికి వెనకాల ఒక బ్యాడ్ ఫాదర్ ఉన్నాడని చెప్పాడంట… మా ఫ్యామిలీని కాపాడటానికి కూడా నాలాంటి బ్యాడ్ సన్ ఒకడున్నాడు! బ్యాడ్ అంటే నీలా కాదు… అదో రకం!” ఇంత మాస్ డైలాగుని తనదైన క్లాస్ లుక్ తో హీట్ పుట్టించేలా చెప్పాడు మహేష్!
మరో పక్క శృతిహాసన్… “మా ఊరు నాకు చాలా ఇచ్చింది, ఎంతోకొంత తిరిగి ఇచ్చెయ్యకపోతే లావెక్కిపోతాను”…
రౌడీలను ఉద్దేశించిన మహేష్… ఎప్పుడు చూసినా ఇదే పనారా… కొంచెం కూడా బోర్ కొట్టదా? అంటూ చెప్పే డైలాగ్స్ ఇలాంటివి చిత్రం లో చాల ఉన్నాయట..మొత్తానికి మహేష్ నుండి రెండేళ్ళ తర్వాత పూర్తీ స్థాయి విందు భోజనం రాబోతుందని అందరు అనుకుంటున్నారు… ఆగష్టు 7న ప్రపంచవ్యాప్తంగా శ్రీమంతుడుగా వచ్చి ఎన్ని రికార్డ్స్ బద్దలు కొడతాడో చూడాలి..
Naga Chaithanya SSS Banner
Suamanth Naruda Donaruda Banner