SPYDER Jai Lava Kusa

Wednesday, 19 August 2015

'Courier Boy Kalyan'will be Released on September..!

గౌతమ్ మీనన్ ప్రొడక్షన్ లో నితిన్ హీరోగా తెరకెక్కిన చిత్రం కొరియర్ బాయ్ కల్యాణ్. చాన్నాళ్ల కిందటే షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ కూడా పూర్తిచేసుకున్న ఈ సినిమా ఇన్నాళ్లకు విడుదలకు నోచుకుంది. గతంలోనే ట్రయిలర్ ను కూడా విడుదల చేసినప్పటికీ సినిమా మాత్రం ఆర్థిక సంక్షోభం వల్ల థియేటర్లలోకి రాలేకపోయింది.
ఎట్టకేలకు ఈ సినిమాకు నిధులు సమకూర్చిపెట్టాడు గౌతమ్ మీనన్. తన సొంత బ్యానర్ ఫాంటమ్ మూవీస్ సంస్థపై గౌతమ్ మీనన్ నిర్మించిన ఈ సినిమాకు ప్రేమ్ సాయి దర్శకత్వం వహించాడు. యామి గౌతమ్ హీరోయిన్ గా నటించింది. సాయికార్తీక్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియోను ఈనెల 23న మార్కెట్ లోకి తీసుకురావాలనుకుంటున్నారు. ఈ ఆడియో ఫంక్షన్ ను గ్రాండ్ గా సెలబ్రేట్ చేయాలనుకుంటున్నారు. ఆడియో ఫంక్షన్ తర్వాత సినిమాను వచ్చేనెల 11న విడుదల చేయాలని అనుకుంటున్నారు. హార్ట్ ఎటాక్ తర్వాత గ్యాప్ తీసుకున్న నితిన్, ఇప్పుడు కొరియల్ బాయ్ కల్యాణ్ తో మరో విజయాన్నందుకోవాలని చూస్తున్నాడు.
Tarun Upcoming Movie
Sampoo KobbariMatta Banner