Vunnadhi Okate Jindhagi Raja The Great

Tuesday, 11 August 2015

Extra Added Scenes in Srimanthudu from This Week |

Extra Scenes Added In Srimantudu



సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు, శృతిహాసన్ జంటగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ‘శ్రీమంతుడు’ చిత్రం గత వారం విడుదలై కలెక్షన్స్ సునామి సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. కాగా రెండో వారంలో ఎంట్రీ అయిన సందర్భంగా ఫాన్స్ కి మరో బంపర్ ఆఫర్ ఇచ్చారు చిత్ర దర్శక , నిర్మాతలు . ఈ చిత్రంలో మరికొన్ని సీన్స్ ఈ వారం నుండి యాడ్ చేయబోతున్నారట.
ఈ సినిమా ప్రీ క్లయిమ్యాక్స్ లో రాజేంద్రప్రసాద్, శృతిహాసన్ కుటుంబం తమ సొంత ఊరు దేవరకోటను విడిచి వెళ్లిపోవడానికి సిద్ధమవుతుందట. ఊరి జనం వెంటరాగా ఈ కుటుంబం ఊరు దాటబోతున్న సమయంలో చిత్రీకరించిన ఈ సీన్ చాలా ఎమోషనల్ గా ఉంటుందట. సినిమాలో ఈ సీన్ ని మొదట్లో తొలిగించారు. అయితే తాజా వార్తల ప్రకారం ఈ సీన్ ని మళ్లీ యాడ్ చేయాలనుకుంటున్నారట. అయితే ఈ సీన్ యాడ్ అయిన తర్వాత మళ్లీ మరోసారి ఈ సినిమాని మహేష్ అభిమానులు చూస్తారని చెప్పొచ్చు. ఆ రకంగా ఈ సినిమాకి రిపీటెడ్ ఆడియన్స్ పెరిగే అవకాశముంది.
నిజం చెప్పాలంటే కొరటాల శివ తన తొలి చిత్రం ‘మిర్చి’ విడుదలైన తర్వాత ఓ రెయిన్ ఫైట్ ని యాడ్ చేసి ఆడియన్స్ ని థ్రిల్ కు గురి చేసారు. ఈ ఫైట్ కోసం అభిమానులు మళ్లీ మళ్లీ ఈ సినిమాని చూసారు. ఇప్పుడదే ప్లాన్ ని ‘శ్రీమంతుడు’ కోసం వాడటం విశేషం.
Tarun Upcoming Movie
Sampoo KobbariMatta Banner