Nikhil EPC exclusive Ramcharan Dhruva exclusive

Tuesday, 11 August 2015

Photo Story: NTR stylish bike in 25th film


సుకుమార్ దర్శకత్వంలో ఎన్‌టిఆర్ , రాకుల్ ప్రీతి సింగ్ జంటగా నటిస్తున్న చిత్రం ’నాన్నకి ప్రేమతో’ (వర్కింగ్ టైటిల్ ). ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ లండన్‌లో జరుగుతుంది. ఈ చిత్రానికి సంబదించిన ఏదో న్యూస్ మీడియా లో ఎప్పుడు చక్కర్లు కొడుతూనే ఉంది..
ఇప్పుడు తాజాగా సుకుమార్ సినిమాలో ఎన్‌టిఆర్ వాడే ఖరీదైన బైక్‌ పోస్టర్‌ని తన అఫీసియల్‌ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు దర్శకుడు. ఇప్పుడు ఈ ఫోటో మీడియా లో హాట్ టాపిక్ అయ్యింది.. ఎన్‌టిఆర్ అభిమానులు అయితే తెగ సంబరపడిపోతున్నారు.
డైరెక్టర్ సుకుమార్‌తో కలిపి సినిమా యూనిట్ సభ్యులు అంతా కలిసి బైక్ దగ్గరికి చేరి ఇచ్చిన ఫోజ్‌ చాలా బాగుండటంతో అభిమానులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ‘వన్’ ఫ్లాప్ తో సుకుమార్ ఈ చిత్రాన్ని చాలా ప్రిస్టేజియస్‌గా తీసుకున్నాడని, అందుకే ఎన్‌టిఆర్‌ని కొత్త స్టైల్, న్యూ లుక్‌తో పరిచయం చేస్తున్నాడని సమాచారం.
Naga Chaithanya SSS Banner
Suamanth Naruda Donaruda Banner