Fidaa exclusive AA DJ

Wednesday, 5 August 2015

One Surprising 'Block' for Mahesh Fans


సూపర్ స్టార్ మహేష్ అభిమానులు ఎప్పుడెప్పుడు తమ హీరోను స్క్రీన్‌పై చూస్తామా అని ఎంతో ఆసక్తిగా చూస్తున్న ఎదురుచూపులకు మరో మూడురోజుల్లో తెరపడనుంది. తెలుగు, తమిళ భాషల్లో భారీ ఎత్తున ఆగష్టు 7న మహేష్ హీరోగా నటించిన ‘శ్రీమంతుడు’ విడుదల కానున్న విషయం తెలిసిందే! ‘మిర్చి’ ఫేం కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అభిమానులకు పండగ వాతావరణాన్ని తెచ్చిపెడుతుందని టీజర్, పోస్టర్స్, ట్రైలర్, ఆడియో స్పష్టం చేసేశాయి. దీంతో సినిమాపై అంచనాలు భారీ ఎత్తున పెరిగిపోయాయ్!
ఇక ఈ అంచనాలకు తోడుగా ‘శ్రీమంతుడు’లో మహేష్ బాబు స్టూడెంట్‌గా కనిపించే ఓ బ్లాక్ అభిమానులకు సర్‌ప్రైజ్ గిఫ్ట్ లాంటిదని కొరటాల శివ తెలపడం ఆసక్తి రేకెత్తిస్తోంది. ప్రమోషనల్ కార్యక్రమాల్లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో మహేష్ స్టూడెంట్‌గా కనిపించే బ్లాక్ గురించి కొరటాల శివ మాట్లాడుతూ.. “ఈ సినిమాలో స్టూడెంట్ నేపథ్యంలో ఒక చిన్న బ్లాక్ ఉంది. మహేష్‌ని స్టూడెంట్‌గా, బుక్స్ పట్టుకొని చూడడం నిజంగా నాకే కొత్తగా అనిపించింది. అచ్చం కాలేజీ స్టూడెంట్‌లా ఒదిగిపోయి కనిపించారాయన. ఈ బ్లాక్ కచ్చితంగా మహేష్ అభిమానులకు మంచి సర్‌ప్రైజ్ ఇస్తుంది” అని తెలిపారు.
మహేష్ ఓ స్టూడెంట్‌గా కనిపించి చాలా కాలమే అయింది. ‘సైనికుడు’ సినిమా తర్వాత మహేష్ మళ్ళీ స్టూడెంట్‌గా కనిపించింది లేదు. దీంతో అభిమానులు కూడా ఈ బ్లాక్ కోసం ఆసక్తిగా చూస్తున్నారు. మైత్రీ మూవీస్ పతాకంపై నిర్మితమైన ఈ సినిమాలో మహేష్ సరసన హీరోయిన్‌గా శృతి హాసన్ నటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు.
Tarun Upcoming Movie
Sampoo KobbariMatta Banner