Nikhil EPC exclusive Ramcharan Dhruva exclusive

Monday, 14 September 2015

Ravi Teja film titled Yevado Okadu

ఇటీవలే ‘కిక్ 2’ మూవీ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న మాస్ మహారాజ్ రవితేజ అప్పుడే తన తదుపరి సినిమా బెంగాల్ టైగర్ ని చివరి దశకు తీసుకొచ్చేసాడు. ఇప్పటికే టాకీ పార్ట్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా సాంగ్స్ షూటింగ్ యూరప్ లో జరుగుతోంది. అన్ని కార్యక్రమాలను త్వరలోనే పూర్తి చేసి అక్టోబర్ చివర్లో లేదా నవంబర్లో ఈ సినిమాని రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే రవితేజ ఇటీవలే తన తదుపరి సినిమా ‘ఓ మై ఫ్రెండ్’ ఫేం వేణు శ్రీరామ్ డైరెక్షన్ లో చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని ఇది వరకే తెలియజేశాం. ఈ సినిమాని శ్రీ వెంకటేశ్వరక్రియేషన్స్ పై దిల్ రాజు నిర్మించనున్నాడు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ చివరి దశలో ఉన్న ఈ సినిమాకి ‘ఎవడో ఒకడు’ అనే టైటిల్ ని ఫైనలైజ్ చేసినట్లు సమాచారం. ఇటీవలే ఈ టైటిల్ ని దిల్ రాజు ఫిలిం చాంబర్ లో రిజిష్టర్ చేయడానికి కూడా కారణం అదే అని విశ్వసనీయ వరాలు చెబుతున్నాయి. ‘ఎవడో ఒకడు’ అనే టైటిల్ ని బట్టే ఈ సినిమాలో మంచి యాక్షన్ ఎపిసోడ్స్ కూడా ఉంటాయని ఆశించవచ్చు. ఈ విషయంపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది. రవితేజకి వేణు చెప్పిన కథ, అలాగే అతని పాత్రని తీర్చి దిద్దిన విధానం బాగా నచ్చడంతో ‘బెంగాల్ టైగర్’ పూర్తి కాగానే ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్ళే పనిలో ఉన్నాడు.
Naga Chaithanya SSS Banner
Suamanth Naruda Donaruda Banner